01 ఆగస్టు 1994

ఓంకారం

హరివిల్లుల చిరునవ్వుల
విశ్వరాగ వింజామర ఇది
విరితోటల పరిమళాల
విశ్వవినుత సందేశమిది

సిరిమల్లెల విరిజల్లుల
విశ్వశాంతి సంకేతమిది
ఎగసిపడే అలలఝరుల
విశ్వవ్యాప్త ఝంకారమిది

నవ్యనాద భవ్యరాగ
విశ్వమానవ వైతాళికమిది
శాంతిదూత భరతమాత
విశ్వరూప సందర్శనమిది

ఓంకారమిది
విశ్వదేవుని ప్రణవనాదమిది.