ఎలా
మొదలేయాలనేదే
అసలు
సమస్య
కనిపించిన
ప్రతిరాయి
రహస్యంగా
నవ్వుతోందనే
అనుమానం
దూర
తీరాలకు
దూసుకెళ్ళే
దృక్కులను
వెనక్కు
లాగుతుంది.
సందేహ
సముద్రంలో
చంద్రుడినై
అలల
రాపిడి మధ్య
కాసేపు
అస్తిత్వం కోల్పోతా
కలల
మెట్లపై జారి
కన్నీరై
కురిసే వేళ
అంతర్యానం
చేయిస్తుంది
ఏకాంతం