వణుకుతున్న
దీపాలు
మోసుకుంటూ
వర్షంలో
తడుస్తున్న
వెన్నెల
దారిలో నేను
గుండెలోకి
ఎగదోసిన
గాలి
వేడి
నిట్టూర్పులా
నా
వెంటే
ఒంటరిగా!
వికసించే
అనుభూతులు
విలీనమయ్యే
సాగర
ద్వారాలు
తెరుచుకుంటున్న
శబ్దం
అద్భుత
ప్రపంచపు
తొలి
ఆనవాలును పలకరిస్తూ
నేను
వేసిన తొలి కేక
అమ్మా!!