30 నవంబర్ 2005

నాకోసం ఆగిన రాత్రి



సెలయేటి నుంచి
నన్నే పిలుసూ
నిన్నటి జ్ఞాపకంలా
నవ్వుతూ నక్షత్రం

దోసిట్లో ఆగని నిజం
తెరలు తెరలుగా
గలగలా
చందమామలా...

పరిభ్రమిస్తున్న జ్ఞాపకాల మధ్య
నాకోసం ఆగిన రాత్రి

25 నవంబర్ 2005

దోసిట్లో నవ్వులు




చీకటి అద్దివెళ్ళిన
నక్షత్రాలు
ఎన్నేసి రంగుల్లో
మెరుస్తున్నాయో కొలనులో!
దోసిట్లోకి తీసుకోవాలని ఉన్నా
కొలనులో దిగాలని లేదు
నన్ను నేను దాటాలనే
ప్రయత్నంలో
నాలోకే నేను
కూరుకుపోతాననే భయం.