కలల
ప్రపంచం
నాకేమీ
కొత్తకాదు.
చీకటి
చేతుల్లో
మెరిసే
గీతల్లో
నన్ను
నేను చూసుకుంటూ
మురిసిపోయే
ప్రపంచం అది.
చలి
చీమల తలలు వంచి
వర్షపు
చుక్కల నిచ్చెనలెక్కి
ఆకాశానికి
మెరుపుకలల
ఉచ్చులు బిగించి
చీకటి
దుప్పటిలో దాగిన
చంద్రుడిని
రోజూ
దోచుకుంటూనే ఉంటాను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి