09 డిసెంబర్ 2005

స్తన్యం



పునరావృతమయ్యే
ప్రతి కేకలో
తోడెవరన్న ఆందోళన
ఓ ఏడుపులా

ఆందోళనను తుంచేస్తూ
అయాచితంగా
అందిన వరం
పెదవుల కంటిన తడి

ఇరుకు గదిలో
అమ్మ కప్పిన ఆప్యాయత
మౌనాన్ని కరిగిస్తూ
లాలిపాటగా

రెప్పల కింద
రంగులద్దుకుంటున్న
ఊహా చిత్రం
ఆకాశంలా...
అమ్మలా...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి