నావైపే
చూసుకుంటున్నా
అద్దంలో
నా పాత్రకు
మొదటి
ప్రేక్షకుడిని
కాలేకపోతున్నా
ఎదుగుతున్న
భ్రమల మధ్య
మబ్బు
తునకలా
నేల
మీది నా నీడ కోసం
వెతుకుతూనే
ఉన్నా
చీకటి
రొదలో
మలుపులు
తిరిగే
నదీ
ప్రవాహంలా
చూపుల
ఎడారిలో
ఓ
కన్నీటి చుక్క
రాల్చిన
పూలు
చాలనుకుందేమో
స్తబ్దంగా
గాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి