కళ్ళకు
జోడు
కాళ్ళకు
జోడు
నోటికి
పూత
ఇన్ని
తొడుగుల నాటకం
ఆసాంతం
అబ్బురపరచింది
రంగురంగుల
వలువలతో
సీతాకోక
చిలుక మురిపిస్తూనే
తెర
మూసుకుంది
* * *
చుట్టూ
చీకటి
రంగుల్లేని
నీడలు
నాకు
అలవాటైనవి కావు
సామూహికంగా
నీడలు
జరిపిన దాడిలో
ఏదో
తెలియని ఓ రహస్యం
శిథిలమైన
ఈ గుహలో
ఒకానొకప్పుడు
ఏముందో?
అపస్మారకంలోనే
ప్రేక్షకుడుగా
నాకు
నేను వేసుకున్న సంకెళ్ళు
* * *
చిందులు
వేస్తున్న
చినుకుల
మధ్య
ఏడుస్తూనే
ఓ ఆశ
నడవాలి
నడుస్తూ...
నడుస్తూ...
కాళ్ళ
కింది దారి
ఆగిపోయేదాకా
నడవాలి
పారిపోయిన
వాడిని
పరామర్శిస్తూ
లోకం
విసిరిన పూలను
అణగదొక్కుతూ
నడవాలి
చీకటి
చెరబట్టిన
నక్షత్రాల
మధ్య
నగ్నంగా
నడవాలి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి