పండు ముదుసలి వగ్గులా
ముడతలు పడ్డ దేహంతో
ఆ చెట్టు
ఆకలేసిన కాకిలా
ఆరో ఋతువు
ఆకులన్నీ అద్దుకు
తినేసింది
ఆకతాయిలకు
వడ్డించిన
ఆ అరవై చేతులు
ఇప్పుడు బోసిపోతూ..
నీడ కూడా ఇవ్వలేక
తడి కళ్ళతో…ఆ కొమ్మ చివరన
మరో చిగురుటాకై
మళ్ళీ
జన్మిస్తూ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి