05 ఏప్రిల్ 2005

మంచుపొదల మధ్య



రాత్రి పగళ్ళ మధ్య దూరాన్ని
జ్ఞాపకాలతో పేర్చుకుంటూ
కొండెక్కుతున్న వెన్నెల దీపం.
మంచుపొదల మధ్య
మెరుస్తున్న మెరుపు రేఖ

వర్షంలో తడుస్తూ
వాకిట్లో నిలచిన
ఆ చీకటి మెరుపుల్లో
సంధికాలం!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి