27 జనవరి 2006

వలయాలు



నడిచొచ్చిన దారి
మూసుకుపోతున్నా
చూపులు మాత్రం
వెనక్కే చొచ్చుకుపోతాయ్

ఎప్పుడో చూసిన చీకటి
ఇప్పుడే చూసినట్లుంటుంది
వెలిసిందనుకున్న వర్షం
మళ్ళీ కురుస్తుంది

చినుకుపోట్లకి
ఛిద్రమైన సెలయేరులా
నా వలయంలో
నేను తిరుగుతూనే ఉంటాను
చీకటి తెలియని
రాత్రి కోసం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి