వెలుగు పరదాలు
పరుచుకుంటూ
పిట్టలు
పరామర్శిస్తున్న
పాతకాలపు
ప్రణయదృశ్యం
ఇంకెంతసేపని?
మబ్బుల
రాపిళ్ళకు
ఆకాశం
రంగు
మార్చేలోపు
నీడ
పొడవు
నిర్ధారించుకోవాలి.
రంగులు
మారుతున్న
సాయంత్రం
రాత్రిలా
మారింది
అర్థం
కాకున్నా
వదిలించుకోలేని
ఆశలు
నక్షత్రాలన్ని.
ముగింపు
ముందే తెలిస్తే
ఏ
ఏ మార్పులుండేవో!
రాత్రికి
రాత్రి
చీకటిలో
కలిసిపోయా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి