మొదటి వాక్యానికి ముందే
మరో కల వ్రాసిన
ముగింపులా-
నదికి ఆవల
నిద్రిస్తున్న నక్షత్రం
చీకటి స్వరాలతో
శ్వాసిస్తూ
పాతకొమ్మలకు
కొత్త రెమ్మలు తొడుగుతుంది.
ముగింపుకు ముందుమాటలా
మబ్బుపూల మధ్య
పూసిన ఓ గాలిపాట
ఆకుల రెప్పల మధ్య
తడి అనువాదమై
వెలుగురెక్కలు పరుచుకుంటూ
పారిపోతుంది.
కొన్ని కలలు అంతే!
రాత్రి రెప్పలకు
రంగులద్దుతూ
కళ్ళలోకి రహస్యమై
ప్రవహిస్తాయి.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి