20 మే 2020

ఇక్బాల్ చంద్


చెట్టు మీద
తూగుతూ, పిట్ట పాడే
గాలి పాటలో

చిగురాకు
కొన మీది
చిరు నవ్వుల రెపరెపలో

సముద్రంలో
జారుకున్న
వెన్నెల శకలంలో

పరుచుకున్న
పుస్తకాల మధ్య
సశేషమైన కవితలో

చీకటి పొరల
చిత్రాన్ని
విచిత్రంగా ఆవిష్కరిస్తూ
కళ్ళల్లో
తొంగిచూస్తూ

ఈయన ప్రతిరోజూ
పలకరిస్తూనే ఉంటాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి