25 ఏప్రిల్ 2020

బీభత్సనారాయణం 2


కహానీలు చెబ్తానని కత్తులునూరితే, పాకేవాడు కూడా పిలక పీకుతాడని మళయాళ మనోరమలో మనుచరిత్ర సీరియల్ కు ముందుమాట రాసిన రోహన్‌బాబు చెప్పాడనే రంగుమార్చుకున్న గుడ్డి రాబందువు గుట్టమీది పావురానికి కన్ను కొట్టిందట. 

రంగు మారిస్తే గుండు పగులుతుందని అంగదుడు హిట్లరుకి శఠగోపం పెట్టి బోధించిన భోజరాజుకధలు పీడకలలై సతాయించాయని వికటకవి వాపోతుంటే, బాత్రూములో గుండీ, గుండీలో గొడ్డలి దాక్కున్నాయని బాబాయ్ భోరుమన్నాడట.

మొన్నామధ్య పళ్లుతోముకోమన్నందుకేగా పాచిపళ్ల పంతులయ్య కిటికీలకు కితకితలు పెట్టి కళ్ళకు రంగేసి నోరు మూసుకొంది. కళ్ళకు కాదు, నోటికి రంగేయమన్నందుకు పంతం పట్టి పదిరోజులపాటు పాకుతూనేగా కాంతారావు కత్తి యుద్ధం చేసి కోడి నోట్లో బీడి పెట్టాడు.

ఎంత పిచ్చిపట్టినా కాలుతున్న చిచ్చుబుడ్డి మీద చీదుతానంటే, కాంతారావుకే కాదు, శాంతారావుకీ బీడీ కాల్చాలనిపిస్తుంది. అందుకేనేమో ‘సుఖరహస్యం’ బోధించమని ఎడిటర్ ‘చాయి’ చీకాకు పెడితే చిరాకేసి చెంబుతో కొట్టాడట చెంఘీజ్ ఖాన్.

మంటెక్కడో పెడ్తే మరేదో పట్టుకున్నాడీ మందభాగ్యుడని మన్మధుడు మధన పడ్తుంటే, మారువేషంలో మా ఉరికెళ్దామని మల్లికాషెరావత్ మారాంచేయటంలోని అంతరార్ధం ఏమంటే ప్రేమతో గోక్కునే చోట జాలిం లోషన్ పూయాలి కానీ, పూసిన చోట గోక్కుంటే పుండు కాక పండు మొలుస్తుందా అని.

మందుకొట్టి ములక్కాయలు గిలక్కాయలౌతాయనుకోవటం మానసికరోగం కాదంటూ, మోకాలడ్డొచ్చిందని మీసం తీసేసిందిట మార్గరెట్ డేనియల్ థాచర్. అంట్లు తోమడం అంటురోగమైతే కాదుకానీ, అట్లతద్దిరోజు చుట్ట వెలిగించి రంగులేసేవాడు అమెరీకాకే తలమానికమౌతాడని మునిమాణిక్యం ఆరోజే చెప్పినమాట ఈరోజుకి వింటున్నారట!

ఆ మాటకొస్తే, కాశీమజిలీ కధల్లో కుళోత్తుంగచోళుడు కుక్కుటాసనం వేసినప్పుడేగా గిరిబాబు కాకెంగిలి చేసిన కాకరకాయ కైకాల నోట్లో పెట్టి కొక్కొరోకో అన్నది. అయినా, చేసిన పాపం చెబితే పోతుందనేగా, ఢిల్లీలో రంగులేద్దామని వెళ్ళిన ఆ మంత్రిముఖ్యుడు గోడకుర్చీ వేసొచ్చింది.

1 కామెంట్‌: