#బీభత్సనారాయణం ఎవరినీ ఉద్దేశించి రాస్తున్నది కాదు. పూర్తి ఊహాజనితమైన ఓ పాత్ర తన ఊహల్లో తానే గుసగుసలాడుకుంటూ మురిసిపోయే కబుర్లివి.
పీక పీక అంటుంటే, నవ్వులాటగా ఒక పీకు పీకితే, పీకంటే పీకటం కాదు, పాలపీక అని చిరంజీవి చిచ్చుబుడ్డి కాల్చి ఔటన్నాడంట. ఔటంటే ఔటు కాదు, ఔటని గిల్లీదండా పట్టుకుని గిరీష్ కర్నాడ్ గజలాతో గిల్లికజ్జాలు పెట్టుకోవటంలో బాలకృష్ణ హస్తం కాదు బాలమురళీకృష్ణ నశ్యం ఉన్నదిట.
వద్దంటే వదిలేస్తే వానపాముకు వరదరాజుకు తేడా యేముందని గెలిలియో గౌతమబుద్ధుడికి ఉపదేశం చేసినా, ఉప్మాలో ఊరగాయ నలుచుకుంటానన్న మతిలేనివీడు వాడేనని వేలు, కాదని కాలు తన్నుకులాడటం బాగోలేదని కాబోలు మందాకిని మరో 'ఉత్తరాతా చరిత్ర రాస్తానంది.
ఉక్కపుడితే ఉబ్బిపోయే గబ్బిళాయికి ఉగ్గుపాలెందుకని ఊర్మిళా మతోండ్కర్ ఉట్టెక్కి కూర్చుంటే, దురదపుట్టి మళ్ళీ బురదలో వేలెట్టాల్సిన అవసరం లేదన్న కొక్కిరాయి కోతిచేతిలో రాయి చూసి గింగిరీలెందుకు కొట్టినా దానర్ధం కూతవేటు దూరంలో కాంబోడియా ప్రధాని కా..కా.. అంటున్నాడనే కదా!
అనుకుంటాం కానీ, మగాడంటే మేరుపర్వతం మీద మోకాళ్లతో దేకేవాడే కానక్కర్లేదని కరటకశాస్త్రి చెప్పిన విషయం తెలిసుంటే, మహాత్ముడు బొందులేని గోచీ పంపేవాడే కాదేమో. అయినా కానున్నదని కాకమానదని కాకి ఈక పీకి కోతి చుట్టూ కడితే కిచకిచలాడేది పిచ్చుకంటారా?
బోడితనానికి, పేడితనానికి అర్ధాన్ని విడమర్చే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అయ్యవారు ఆనాడే చేసారని అగస్త్యుడు అగ్గిమీద గుగ్గిలంలా జాషువా గబ్బిళానికి అడ్డెందుకు పడుతున్నాడో మాడాకు అర్ధమైతే, కళింగయుద్ధం జరిగేదికాదని అశోకుడు ఆర్కిమెడిసుతో చెప్పాడట.
ఏం జరిగినా తెలియట్లేదెందుకని డాక్టర్ భ్రమరాన్ని అడిగితే బాణామతి రాసిన ఆవకాయలో అంటుగట్టే పద్ధతుంటుందని ఆర్థర్ కాటన్ అర్ధంతరంగా వదిలేసిన ప్రయోగమోసారి చేయాలని పట్టాపొందిన రాంగారు ఎందుకు చెప్పారో తెలియాలంటే వేమన రాసిన గాలిబ్ గీతమోసారి వెనకనుంచి చదవాలి.
ఆవపిండికి అరటిపండుకు తేడా తెలీని వయసులోనే కమండలం పట్టుకొని కమలాకర కామేశ్వర్రావు కెనాడా వెళ్ళాడని, ముక్కామల మీసం తిప్పితే, తానేమీ తక్కువ తినలేదంటూ మిక్కిలినేని మూతంతా తిప్పాడని బొర్రా గుహలో బొచ్చాగారు బృహస్పతికి బోధించారు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి