04 ఆగస్టు 2006

నక్షత్రాలు

వంకర నవ్వుతో
ఒంటరి ప్రపంచంలో
చొరబడే చంద్రుడు

తల క్రిందులుగా
తపసు చేస్తూ
చూరు మీది చినుకు

వానపాటకి
తప్పట్లు కొడుతూ
రెక్కలు చేసే చప్పుడు

కాకి కబుర్లు వింటూ
వానప్రస్థంలో
ఒంటరి చెట్టు

దాచిపెట్టుకున్న రెక్కలు
మళ్ళీ తొడిగి
ఎగిరిపోవాలనుంది.

ఇంత పెద్ద ఆకాశంలో
మరో నక్షత్రానికి
చోటు లేకపోదు!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి