16 ఆగస్టు 2006

ప్రవాహంలో ...



మెలికలు తిరిగే
ప్రశ్నార్ధకాల ప్రవాహంలో
నేనూ ఓ చుక్కనే!

మలుపుల మధ్య
ఎగుడుదిగుళ్ళ మధ్య
ప్రతి రాయి చెప్పిన రహస్యం
రాత్రి వానలో ఒదిగిపొమ్మనే.

చీకటి వేసిన
చిక్కుముళ్ళు సవరిస్తూ
మరచిపోయిన
ఆనవాళ్ళను పరామర్శించే
రేపటి కోసం
మూసేసిన పుస్తకాన్ని
మరోసారి తెరవాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి